![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -262 లో.....మీరు పనులు తప్పించుకోవాలని డాక్టర్ కి డబ్బులిచ్చి మీకు నచ్చినట్టు చెప్పామన్నారు.. అదే డాక్టర్ కి నేను చెక్ ఇచ్చి నాకు నచ్చినట్టు చెప్పమన్నానని రామలక్ష్మి అనగానే.. శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. దెబ్బ అదుర్స్ కదూ అని రామలక్ష్మి వాళ్ళకి కౌంటర్ వేస్తుంది. మరొకవైపు సీతాకాంత్ ఆఫీస్ లో డల్ గా ఉంటాడు. అప్పుడే నందిని వచ్చి ఏమైందంటు అడుగుతుంది.
సీతాకాంత్ ఏదో చెప్పబోతు ఆగిపోతాడు. దాంతో ఏంటి సీతా ఆ రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా.. అసలు ఆ రామలక్ష్మి ఆస్తి కోసమే ఇదంతా చేస్తుంది. మీ వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంది. నాకు అయితే ఆంటి వాళ్ళని తీసుకొని వచ్చి.. మా ఇంట్లో మహారాణిలా చూసుకోవాలని ఉంది.. ఇప్పకటికైనా అర్థమైందా ఎవరు ఎలాంటి వారోనని రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతుంది నందిని. దాంతో తనపై సీతాకాంత్ గట్టిగా అరుస్తాడు. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడడానికి వీలు లేదు. ఏదైనా మేం ఇద్దరం చూసుకుంటాం. నీకు అనవసరమంటూ సీతాకాంత్ అనగానే.. నీ మూడ్ ఏం బాలేనట్టు ఉందని చెప్పి తను వెళ్ళిపోతుంది. వర్క్ చెయ్యాలని అనిపించడం లేదు సీతాకాంత్ అలా కాసేపు తిరిగి వద్దామని బయటకు వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. సీతాకాంత్ వెళ్లడం చూసి తను కూడా తన వెంట నడుస్తుంది.
మరొకవైపు రామలక్ష్మి మనల్ని ఇలా ఆడుకుంటుందని శ్రీలత వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడే నందిని ఫోన్ చేస్తుంది. ఇంత జరిగిన కూడా రామలక్ష్మిని సీతాకాంత్ ఏం అనట్లేదని నందిని అంటుంది. ఇక రామలక్ష్మిని చంపెయ్యాలని సందీప్ అనగానే ఆ మన అలా అయితే ఆస్తులు కూడా పోతాయ్.. ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ రామలక్ష్మికి తెలియకుండా సీతాకి తను పంపినట్లు విడాకులు నోటిస్ పంపాలని నందినికి శ్రీలత చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ వెనకాలే రామలక్ష్మి వస్తుంటే.. రామలక్ష్మిని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తుంటారు. సీతాకాంత్ వాళ్ళని కొట్టి రామలక్ష్మిని తన పక్కన నడవమంటాడు. ఆటో పిలిచి ఆటోలో తనని పంపిస్తాడు. మరొకవైపు సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి శ్రీలత, శ్రీవల్లి తన ప్లాన్ ని అమలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |